- హరిత సంరక్షణ & అభివృద్ధి
- ఎస్‌ఐఆర్ విచారణ
- ఎన్నికల సన్నద్ధత
- సంక్షేమ కార్యక్రమాలు
ఆంధ్రా పల్స్ – గుంటూరు: గుంటూరు జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతితో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ సమగ్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
హరిత సంరక్షణ & అభివృద్ధి: ‘గ్రీన్ గుంటూరు‘ కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. అలాగే వీబీజీ రామ్‌జీ సహా ఇతర అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎస్‌ఐఆర్ విచారణ: ఎస్‌ఐఆర్ (SIR) కింద నోటీసులు అందుకున్న లబ్ధిదారులకు/వ్యక్తులకు నిర్దేశిత సమయంలోగా పారదర్శకంగా హియరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
ఎన్నికల సన్నద్ధత: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
సంక్షేమ కార్యక్రమాలు: ‘అక్షరాంధ్ర‘ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని, ఆధార్ కార్డులు లేని యానాది కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి వారికి తక్షణమే కార్డులు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) ఖాజావలితో పాటు ఇతర శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.