ఇవాళ, రేపు వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఆంధ్రా పల్స్ - హైదరాబాద్: రాష్ట్రంలో సోమ, మంగళవారం రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించనున్నాయని తెలిపింది. రుతుపవన ద్రోణి కూడా అల్పపీడన కేంద్రం మీదుగా సాగుతుండటంతో వాతావరణంలో...