రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఏలూరు జిల్లా ముసునూరులో దేశంలోనే తొలి నాన్-జీఎంఓ హైబ్రిడ్ పాప్‌కార్న్ విత్తనాలు ఆవిష్కరణ   ఆంధ్రా పల్స్ - ​ముసునూరు: వ్యవసాయాన్ని లాభసాటి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్ది, రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలు (ఎంట్రప్రెన్యూర్లు)గా నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరులో ప్రముఖ ఆహార శుద్ధి సంస్థ ‘గార్మె పాప్‌కార్నికా’ ఆధ్వర్యంలో రూపొందించిన దేశంలోనే తొలి నాన్-జీఎంఓ (జన్యుమార్పిడి లేని) పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్ట్రపతి సి.పి....