హెచ్చరిక లేబుళ్లు
ప్యాక్ చేసిన ఆహార పదార్థాల మార్కెట్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఆధునిక జీవనశైలిలో భాగమైన ఈ ఆహారం మన ఆరోగ్యంపై, ముఖ్యంగా పిల్లలపై త్రీవ ప్రభావం చూపుతోందనేది చర్చనీయాంశంగా మారింది. నేడు మార్కెట్లో లభించే అత్యధిక శాతం ప్రాసెస్ చేసిన ఆహార ప్యాకెట్లపై ‘షుగర్ ఫ్రీ’, ‘సహజమైనది’, ‘కొలెస్ట్రాల్ ఫ్రీ’, లేదా ‘పోషకాలతో కూడినది’ అని ఆకర్షణీయమైన అక్షరాలతో ప్రచారం చేస్తుంటారు. కానీ నిజానికి ప్యాకెట్ వెనుక భాగంలో అతి చిన్న అక్షరాలతో ముద్రించే సమాచారాన్ని పరిశీలిస్తే అందులో అధిక మొత్తంలో సేచురేటెడ్ కొవ్వులు,...