రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Date:

📰 Generate e-Paper Clip

  • ఏలూరు జిల్లా ముసునూరులో దేశంలోనే తొలి నాన్-జీఎంఓ హైబ్రిడ్ పాప్‌కార్న్ విత్తనాలు ఆవిష్కరణ

 

ఆంధ్రా పల్స్ – ​ముసునూరు: వ్యవసాయాన్ని లాభసాటి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్ది, రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలు (ఎంట్రప్రెన్యూర్లు)గా నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరులో ప్రముఖ ఆహార శుద్ధి సంస్థ ‘గార్మె పాప్‌కార్నికా’ ఆధ్వర్యంలో రూపొందించిన దేశంలోనే తొలి నాన్-జీఎంఓ (జన్యుమార్పిడి లేని) పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు.

​అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్నదాతలపై ఉన్న ప్రత్యేక అభిమానంతో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ స్వయంగా ఏలూరు జిల్లాకు విచ్చేసి, మన రైతులు పండించే నాన్-జీఎంఓ విత్తనాలను ఆవిష్కరించడం గర్వకారణమని కొనియాడారు.

స్వదేశీ సంపదగా ‘గార్మె పాప్‌కార్న్’: భారత నేలపైనే రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకుని నాన్-జీఎం హైబ్రిడ్ విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న ఘనత ‘గార్మె పాప్‌కార్న్’ సంస్థకు దక్కుతుందన్నారు. దేశవ్యాప్తంగా పాప్‌కార్న్ మార్కెట్‌లో 70 శాతం వాటాను కలిగి ఉన్న ఈ సంస్థ, సుమారు 17,500 మంది రైతులతో 40 వేల ఎకరాల్లో సాగు విస్తరించి దేశంలోనే అతిపెద్ద పాప్‌కార్న్ తయారీ సంస్థగా అవతరించడం అభినందనీయమన్నారు.

నూజివీడు గడ్డ నుంచి గ్లోబల్ మార్కెట్‌కు: నూజివీడు నేలల్లో పండే మొక్కజొన్న ముసునూరులోని అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా కావడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి కానుందని తెలిపారు. గతంలో మనం పాప్‌కార్న్ కొనుగోలుకు బ్రెజిల్ వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇకపై ఆ సంపద దేశంలోనే ఉంటూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రైల్వే స్టేషన్లలో ఆంధ్రా ఉత్పత్తులు: స్థానిక ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించేందుకు రైల్వే స్టేషన్లలో మన ‘ఆంధ్రా పాప్‌కార్న్’, ‘అరకు కాఫీ’ కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ప్రసిద్ధి చెందిన కొండపల్లి/కొండవీటి కొయ్యబొమ్మల వంటి స్వదేశీ కళారూపాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్‌తోనే విలువ జోడింపు: పసుపు, మొక్కజొన్న, మిరప, ఆక్వా వంటి ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా విలువ జోడించి (వాల్యూ ఎడిషన్), సొంత బ్రాండింగ్‌తో గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేసినప్పుడే రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందని పిలుపునిచ్చారు. ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ, అధునాతన సాంకేతికతతో రైతులంతా ఆహార శుద్ధి రంగం వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొలుసు పార్థసారథి, కింజరాపు అచ్చెన్నాయుడు, గార్మె పాప్‌కార్నికా ఎండీ ఎస్‌బీపీ పట్టాభిరామారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Share post:

Subscribe

Popular

More like this
Related

ఏపీ ఎన్నికల షెడ్యూల్ పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: ఈసీ

ఆంధ్రా పల్స్ - అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల...

శాఖల్లో సమర్ధత – సేవల్లో నాణ్యత

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం డేటా ఇంటిగ్రేషన్ డెంగీ, మలేరియా నివారణకు...

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

హరిత సంరక్షణ & అభివృద్ధి ఎస్‌ఐఆర్ విచారణ ఎన్నికల సన్నద్ధత ...

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 116 అర్జీలు

ఆంధ్రా పల్స్ - నరసరావుపేట: నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా...
App Icon

Install AP News App

Add to home screen for faster loading and latest updates.